ఈసారికి సరే.. భవిష్యత్తులో జాగ్రత్త వహించండి

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు దిల్లీలోని న్యాయస్థానం ప్రత్యేక జడ్జి నీలోఫర్‌ ఆబిదా పర్వీన్‌ ప్రకటించారు. అయితే ఇకపై ఆయన జాగ్రత్తగా

Published : 25 Sep 2022 05:33 IST

రాబర్ట్‌ వాద్రాకు దిల్లీ కోర్టు ఆదేశం

నిబంధనల ఉల్లంఘనపై షోకాజ్‌ నోటీసు ఉపసంహరణ

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు దిల్లీలోని న్యాయస్థానం ప్రత్యేక జడ్జి నీలోఫర్‌ ఆబిదా పర్వీన్‌ ప్రకటించారు. అయితే ఇకపై ఆయన జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. యూఏఈ మీదుగా యూకే వెళ్తూ దుబాయ్‌లో నాలుగు రోజులపాటు బస చేయడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారని వాద్రాపై అభియోగాలున్నాయి. వైద్యపరమైన కారణాలతోనే తాను అక్కడ ఉండాల్సి వచ్చిందని ఈ నెల 20న వాద్రా చేసిన వాదనను న్యాయస్థానం తొలుత అంగీకరించలేదు. రూ.25 లక్షల ఫిక్సిడ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని ఎందుకు జప్తు చేసుకోరాదని ఆయనకు షోకాజ్‌ జారీ చేసింది. ప్రమాణపత్రంలో విషయాలను పరిశీలించాక.. వాద్రా చర్య ఉద్దేశపూర్వకం కాదని న్యాయస్థానం సంతృప్తి చెందింది. ఆయన బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పినందువల్ల ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎఫ్‌డీలను విడుదల చేయాలని ఆదేశించింది. నగదు అక్రమ చలామణి కేసులో వాద్రా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని