Mukul Rohatgi: అటార్నీ జనరల్‌ పదవిని తిరస్కరించిన ముకుల్‌ రోహత్గీ

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన అటార్నీ జనరల్‌ పదవిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో

Updated : 26 Sep 2022 07:18 IST

ఈనాడు, దిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన అటార్నీ జనరల్‌ పదవిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో ధ్రువీకరించారు. తన నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదన్నారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అనంతరం కొనసాగడానికి వేణుగోపాల్‌ ఇప్పటికే తిరస్కరించారు. దీంతో ఆ పదవిని చేపట్టాలని రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా.. అందుకు రోహత్గీ అంగీకరించలేదు. రోహత్గీ ఇదివరకు 2014 జూన్‌ 19 నుంచి 2017 జూన్‌ 18 వరకు అటార్నీ జనరల్‌గా కొనసాగారు. అప్పుడు రెండోసారి కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నించగా తిరస్కరించారు. దాంతో 86 ఏళ్ల వయస్సులో కేకే వేణుగోపాల్‌ను మూడేళ్ల కాలానికి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది. తర్వాత ఆయన్నే కొనసాగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు