ఈశాన్య రాష్ట్రాల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ప్రత్యేక అలవెన్సుల ఉపసంహరణ

ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న అఖిల భారత సర్వీసు (ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌వో) అధికారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను, ప్రత్యేక అలవెన్సులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. తక్షణమే

Published : 26 Sep 2022 04:58 IST

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

దిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న అఖిల భారత సర్వీసు (ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌వో) అధికారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను, ప్రత్యేక అలవెన్సులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. తక్షణమే ఇది అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులో వెల్లడించింది. అధికారుల మూల వేతనంలో 25శాతం మొత్తాన్ని ప్రత్యేక అలవెన్సుగా చెల్లిస్తున్నారు. ఇది ఇతర అలవెన్సులకు అదనం. 2009 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. 2007 నుంచి 2017 వరకు వివిధ ఉత్తర్వుల ద్వారా మంజూరు చేసిన ప్రోత్సాహకాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వులో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం వెల్లడించింది. ఈశాన్య ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు