అయిదోసారి గంగ ఒడిలోకి దుర్గ మందిరం

గంగా నది ఒడ్డున నిర్మించిన ఓ దుర్గాదేవి దేవాలయం వరదలతో తీరం కోతకు గురవడంతో నది పాలైంది. దీంతో స్థానికులు మళ్లీ అదే ఒడ్డున అమ్మవారికి మరో మందిరం నిర్మించారు.

Published : 26 Sep 2022 04:58 IST

మాల్దా(పశ్చిమబెంగాల్‌): గంగా నది ఒడ్డున నిర్మించిన ఓ దుర్గాదేవి దేవాలయం వరదలతో తీరం కోతకు గురవడంతో నది పాలైంది. దీంతో స్థానికులు మళ్లీ అదే ఒడ్డున అమ్మవారికి మరో మందిరం నిర్మించారు. అదీ కూడా అలాగే వరదలతో కోతకు గురైన గట్టుతో నీటిలో కలిసిపోయింది. ఇలా ఇప్పటి వరకూ నాలుగుసార్లు జరిగింది. అయినప్పటికీ నిరుత్సాహానికి గురికాని గ్రామస్థులు మరోసారి కోవెలను భక్తిశ్రద్ధలతో పునర్నిర్మించారు. ఈసారి కూడా నదీ జలాలు మందిరం ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో దేవాలయం ముంపు ముప్పును ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి మాల్డా జిల్లాలోని దర్బారితోలా గ్రామంలో చోటు చేసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని