అఫ్గాన్‌ నుంచి భారత్‌ చేరుకున్న 55 మంది సిక్కులు, హిందువులు

తరతరాలుగా తాము నివాసం ఉంటున్న అఫ్గానిస్థాన్‌ నేలను విడిచి.. ఆదివారం 55 మంది సిక్కులు, హిందువులు దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. దీంతో ఇక పదుల

Published : 26 Sep 2022 04:58 IST

చండీగఢ్‌: తరతరాలుగా తాము నివాసం ఉంటున్న అఫ్గానిస్థాన్‌ నేలను విడిచి.. ఆదివారం 55 మంది సిక్కులు, హిందువులు దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. దీంతో ఇక పదుల సంఖ్యలో సిక్కులు, హిందువులు మాత్రమే ఆ దేశంలో మిగిలారు. గత ఏడాది ఆగస్టులో అఫ్గాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత చాలా మంది సిక్కులు, హిందువులు భారత్‌కు తరలివచ్చారు. జూన్‌లో కాబుల్‌లోని కార్తే పర్వాన్‌ గురుద్వారాపై ఉగ్రదాడి అనంతరం ఈ సంఖ్య మరింత పెరిగింది. ఆదివారం చేరుకున్న 55 మంది ప్రయాణ ఏర్పాట్లను శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ పర్యవేక్షించింది. వీరి కోసం కాబుల్‌నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం ఈ-వీసాలు మంజూరు చేయడంతో వేగంగా స్పందించింది. అయితే వీరితో పాటు సిక్కుల పవిత్ర గ్రంథాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి  నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు