క్యూయెట్‌ ఆధారంగా పీజీలో ప్రవేశాలు

యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (క్యూయెట్‌)-2022 ఫలితాలు సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా విడుదలయ్యే అవకాశం

Published : 26 Sep 2022 04:58 IST

అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వర్సిటీలకు యూజీసీ లేఖ

ఈనాడు, దిల్లీ: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (క్యూయెట్‌)-2022 ఫలితాలు సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా విడుదలయ్యే అవకాశం ఉన్నందున దాని ఆధారంగా ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు యూజీసీ లేఖలు రాసింది. ‘‘యూజీసీ నిధులతో నడిచే కేంద్ర విశ్వవిద్యాలయాలు, క్యూయెట్‌లో భాగస్వాములైన రాష్ట్ర/ప్రైవేటు/ డీమ్డ్‌ యూనివర్సిటీల్లో 2022-23కు సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఉమ్మడి పరీక్ష నిర్వహించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. వాటి ఆధారంగా ప్రవేశాల కల్పన కోసం వెబ్‌సైట్లు, వెబ్‌పోర్టళ్లు ఏర్పాటుచేసుకోండి. దానివల్ల సకాలంలో పీజీ ప్రవేశాలు నిర్వహించడానికి వీలవుతుంది’’ అని యూజీసీ ఈ లేఖలో వైస్‌ ఛాన్సలర్లకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని