రోజూ 10 లక్షల ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల పంపిణీ లక్ష్యం

రోజూ 10 లక్షల ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ పథకం కింద 3.95 కోట్ల మంది

Published : 26 Sep 2022 04:58 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడి

దిల్లీ: రోజూ 10 లక్షల ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ పథకం కింద 3.95 కోట్ల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందారని.. వారి వైద్య ఖర్చుల కోసం రూ.45,294 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి-జన్‌ ఆరోగ్య యోజన(ఏబీ పీఎం-జాయ్‌) ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘ఆరోగ్య మంథన్‌-2022’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల ద్వారా 19 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ‘‘గతంలో రోజూ 1-1.5 లక్షల కార్డుల పంపిణీ జరిగేది. ఇప్పుడు 4-5 లక్షల కార్డుల పంపిణీ జరుగుతోంది. దీన్ని 10 లక్షలకు పెంచాలన్నదే లక్ష్యం’’ అని మంత్రి వెల్లడించారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌’ కింద దేశంలోని ప్రతి జిల్లాలో మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 28,300పైగా ఆసుపత్రులు నమోదయ్యాయని.. ఇందులో 46 శాతం ప్రైవేటు ఆసుపత్రులని వివరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని