ఆందోళన చేసిన రైతుల ఖాతాల రద్దుకు కేంద్రం ఆదేశం

దిల్లీ, హరియాణాల్లో రైతులు ఆందోళనకు దిగిన సమయంలో 60 శాతం ట్వీట్లను తొలగించి వారి ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం తమకు తాఖీదులు జారీ చేసిందని ట్విటర్‌ ఆరోపించింది.

Published : 27 Sep 2022 04:53 IST

కర్ణాటక హైకోర్టులో ‘ట్విటర్‌’ ఆరోపణలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: దిల్లీ, హరియాణాల్లో రైతులు ఆందోళనకు దిగిన సమయంలో 60 శాతం ట్వీట్లను తొలగించి వారి ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం తమకు తాఖీదులు జారీ చేసిందని ట్విటర్‌ ఆరోపించింది. కేంద్రం పేర్కొన్న ఆ ఖాతాల్లో ఎలాంటి అభ్యంతరకరమైన, దేశ భద్రత, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే వ్యాఖ్యలు లేవని పేర్కొంది. ట్విటర్‌ సంస్థ తరఫు సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాతార్‌ కర్ణాటక హైకోర్టులో జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ దృష్టికి ఈ అంశాలను సోమవారం తీసుకెళ్లారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వని వారందరి ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం తాఖీదులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ట్విటర్‌లో 1,474 ఖాతాలు నిలిపేసి 175 ట్వీట్లను తొలగించాలని కేంద్రం ఆదేశించిందని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబరు 17కు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని