దళిత పారిశుద్ధ్య కార్మికుడికి కేజ్రీవాల్‌ విందు

గుజరాత్‌కు చెందిన దళిత పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి సోమవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నివాసంలో విందు ఇచ్చారు. ఇటీవల పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. ఈ ఏడాది ఆఖర్లో

Published : 27 Sep 2022 04:57 IST

గుజరాత్‌ నుంచి దిల్లీకి  పిలిపించుకుని మర్యాద

దిల్లీ: గుజరాత్‌కు చెందిన దళిత పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి సోమవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నివాసంలో విందు ఇచ్చారు. ఇటీవల పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. ఈ ఏడాది ఆఖర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోనూ భాజపాను ఓడించి అధికారం చేజిక్కించుకొనేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ఆ సమయంలో హర్ష్‌ సోలంకీ అనే పారిశుద్ధ్య కార్మికుడు.. తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా దిల్లీ సీఎంను ఆహ్వానించి అందరి దృష్టిని ఆకర్షించారు. అందుకు ప్రతిగా కేజ్రీవాల్‌ తానొస్తానని, అయితే ముందుగా దిల్లీలో తన ఇంటిలో విందు స్వీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో మాతృమూర్తి, సోదరితో తన నివాసానికి చేరుకున్న సోలంకీని కేజ్రీవాల్‌ శాలువాతో సత్కరించారు. అనంతరం కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటాన్ని సీఎంకు సోలంకీ బహూకరించారని దిల్లీ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీన్నో రాజకీయ విన్యాసంగా భాజపా, కాంగ్రెస్‌లు కొట్టిపారేశాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts