సీయూఈటీ-పీజీ పరీక్ష ఫలితాల విడుదల

దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ’ ఫలితాలు సోమవారం

Published : 27 Sep 2022 05:14 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-పీజీ’ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అందులో సబ్జెక్టులవారీగా అత్యుత్తమ మార్కులు సాధించినవారి పేర్లను కూడా జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. సీయూఈటీ-పీజీ కోసం మొత్తం 6.07 లక్షల మంది అభ్యర్థులు నమోదుచేసుకోగా.. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షను నిర్వహించిన సంగతి గమనార్హం. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించాయి. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇక ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు