దసరా వేళ.. భారీ కుట్రకు పీఎఫ్‌ఐ పన్నాగం

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాల తర్వాత ఆ సంస్థ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపా, ఆర్‌.ఎస్‌.ఎస్‌.

Published : 27 Sep 2022 05:14 IST

ముంబయి: ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాల తర్వాత ఆ సంస్థ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపా, ఆర్‌.ఎస్‌.ఎస్‌. అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పీఎఫ్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా బయటికొచ్చింది. దసరా నవరాత్రుల వేళలో ఈ నేతల కదలికలపై దృష్టి పెట్టాలని పీఎఫ్‌ఐ ప్రణాళికలు రచించినట్లు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు వెల్లడించాయి. నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం సైతం వీరి జాబితాలో ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భాజపా, సంఘ్‌ నేతలతోపాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయమై నిఘా వర్గాలు ఆయా నేతలు, సంస్థలను అప్రమత్తం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts