పదం తప్పు రాశాడని చావబాదిన టీచర్‌.. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

పరీక్షలో ఒక పదం తప్పు రాశాడని ఓ విద్యార్థిని టీచరు చావబాదడంతో ఆ విద్యార్థి 18 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఔరైయా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అఛల్దా పోలీస్‌స్టేషను

Updated : 27 Sep 2022 07:50 IST

ఔరైయా (యూపీ): పరీక్షలో ఒక పదం తప్పు రాశాడని ఓ విద్యార్థిని టీచరు చావబాదడంతో ఆ విద్యార్థి 18 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఔరైయా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అఛల్దా పోలీస్‌స్టేషను పరిధిలోని ఆదర్శ్‌ కళాశాలలో వైషోలి గ్రామానికి చెందిన నిఖిత్‌ కుమార్‌ (15) పదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబరు 7న సైన్స్‌ టీచర్‌ అశ్వనీసింగ్‌ ఓ పరీక్ష నిర్వహించారు.

ఆ పరీక్షలో ఒక పదం తప్పు రాసిన నిఖిత్‌ను అశ్వనీసింగ్‌ జుట్టు పట్టుకొని కర్రతో దారుణంగా కొట్టారు. నిఖిత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లఖ్‌నవూ వెళ్లినా ఉపయోగం లేకపోయింది. కళాశాల ప్రిన్సిపాల్‌ సూచన మేరకు  నిఖిత్‌ వైద్యఖర్చు రూ.40 వేలు.. అశ్వనీసింగ్‌ భరించారు. చికిత్స పొందుతూ సోమవారం నిఖిత్‌ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts