కీమో దుష్ప్రభావాలకు సెలవు

క్యాన్సర్‌ బారినపడ్డ కణాల్లోకి నేరుగా కీమోథెరపీ మందులను చేరవేసేందుకు గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతమున్న కీమోథెరపీ ఔషధాలు.. క్యాన్సర్‌ కణాలతో పాటు ఆరోగ్యకరమైన

Published : 27 Sep 2022 05:14 IST

 కొత్త విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ గువాహటి పరిశోధకులు

ఈనాడు, గువాహటి: క్యాన్సర్‌ బారినపడ్డ కణాల్లోకి నేరుగా కీమోథెరపీ మందులను చేరవేసేందుకు గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతమున్న కీమోథెరపీ ఔషధాలు.. క్యాన్సర్‌ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలనూ చంపేస్తుంటాయి. దీనివల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి ప్రతికూల ప్రభావాల వల్ల కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ ఇబ్బందులను తగ్గించడానికి గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రత్యేక మాలిక్యూల్స్‌ను తయారుచేశారు. అవి తమంతట తాము ఒక చోట చేరి, కీమో ఔషధాన్ని ఒడిసిపడతాయి. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు మాత్రమే అతుక్కుంటాయి. పరారుణ కాంతిని ప్రయోగించినప్పుడు అవి విచ్ఛిన్నమై, వాటిలోని మందు క్యాన్సర్‌ కణంలోకి ప్రవేశిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని