SupremeCourt: తప్పుడు వివరాలిచ్చే ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించొచ్చు

ఉద్యోగ అర్హతకు సంబంధించి తమ ఫిట్‌నెస్‌/యోగ్యతపై తప్పుడు వివరాలు సమర్పించేవారిని, వాస్తవాలను దాచిపెట్టేవారిని సర్వీసు నుంచి తొలగించొచ్చని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అబద్ధాలు చెప్పడం, వాస్తవాలను

Updated : 27 Sep 2022 08:29 IST

 సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: ఉద్యోగ అర్హతకు సంబంధించి తమ ఫిట్‌నెస్‌/యోగ్యతపై తప్పుడు వివరాలు సమర్పించేవారిని, వాస్తవాలను దాచిపెట్టేవారిని సర్వీసు నుంచి తొలగించొచ్చని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అబద్ధాలు చెప్పడం, వాస్తవాలను దాచడమన్నది వారి ప్రవర్తన తీరును సూచిస్తుందని పేర్కొంది. ప్రధానంగా పోలీసు బలగాల నియామక ప్రక్రియల్లో ఆ వివరాలను నిశితంగా పరిశీలించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. తనపై ఉన్న క్రిమినల్‌ కేసుకు సంబంధించి అభ్యర్థి సరైన సమాచారాన్ని అందించినంతమాత్రాన.. తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. గతంలో ఉన్న కేసుల ఆధారంగా ఆ వ్యక్తి ప్రవర్తన శైలిని అంచనా వేసి.. ఉద్యోగానికి యోగ్యుడో కాదో యాజమాన్యం నిర్ధారించుకోవచ్చని తెలిపింది. తమపై ఉన్న కేసుల వివరాలను దాచిపెట్టిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తరహా కేసుల్లో ఎలాంటి సూత్రాలను వర్తింపజేయాలన్నదానిపై కూడా జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం కీలక మార్గదర్శకాలను వెలువరించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts