ఛత్తీస్‌గఢ్‌లో వైద్య బృందం అపహరణ.. విడుదల

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బైరాంగఢ్‌ ప్రాంతంలోని ఇంద్రావతి నది తీరంలో ఉన్న ఓ గ్రామంలో మావోయిస్టులు సోమవారం వైద్య బృందాన్ని అపహరించారు. అనంతరం వైద్య సిబ్బంది వేడుకోవడంతో విడిచిపెట్టారు. ఇంద్రావతి నది

Published : 27 Sep 2022 05:53 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బైరాంగఢ్‌ ప్రాంతంలోని ఇంద్రావతి నది తీరంలో ఉన్న ఓ గ్రామంలో మావోయిస్టులు సోమవారం వైద్య బృందాన్ని అపహరించారు. అనంతరం వైద్య సిబ్బంది వేడుకోవడంతో విడిచిపెట్టారు. ఇంద్రావతి నది తీర ప్రాంతంలో ఉన్న ఏడు గ్రామాల్లోని ఆదివాసీలకు అంతుచిక్కని వింత వ్యాధి సోకింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేసేందుకు ఇద్దరు సర్పంచులతో కలిసి ఓ వైద్యాధికారి, 22 మంది వైద్య సిబ్బంది మోటారు బోటులో ఆయా గ్రామాలకు వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు వీరిని అపహరించి బంధించారు. మోటారు బోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య బృందం బతిమిలాడటంతో సోమవారం సాయంత్రం వదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని