ఆక్రమిత కశ్మీర్‌ అంశాన్ని 1971లోనే తేల్చేయాల్సింది: రాజ్‌నాథ్‌

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశంలో 1971 యుద్ధ సమయంలోనే గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌లోని బదోలీ, నాదౌన్‌లో అమరవీరుల కుటుంబాలను

Published : 27 Sep 2022 05:53 IST

శిమ్లా: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశంలో 1971 యుద్ధ సమయంలోనే గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌లోని బదోలీ, నాదౌన్‌లో అమరవీరుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని ఇటీవల స్వర్ణోత్సవాలను జరుపుకొన్నాం. అది ఆస్తులు, అధికారం కోసం జరిగిన పోరు కాదు. మానవత్వం కోసం జరిగిన సమరం. నాడు ప్రత్యర్థిపై విజయం సాధించాం. అయితే ఒకటే ఆక్షేపణ ఉంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అంశాన్ని అప్పట్లోనే తేల్చేయాల్సింది’’ అని పేర్కొన్నారు. దేశం స్వయం సమృద్ధి, పురోగతి సాధించేలా చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందన్నారు. ‘‘ఒకప్పుడు భారత్‌ను ఆయుధాల దిగుమతిదారుగా గుర్తించేవారు. నేడు ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి ఆయుధ ఎగుమతిదారుల్లో మన దేశం ఉంది. 8 ఏళ్ల కిందట రూ. 900 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇప్పుడు అవి రూ.13వేల కోట్లకు చేరాయి. 2025 నాటికి రూ.35వేల కోట్లకు పెరుగుతాయి. 2047 కల్లా రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని సాధిస్తాం’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని