సొంత భూభాగాల వెలుపల రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార ప్రకటనలను అడ్డుకోండి

రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగాలకు వెలుపల ప్రచార ప్రకటనలు ఇవ్వకుండా నిరోధించాలని కోరుతూ కామన్‌ కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పందనను తెలపాలని

Published : 27 Sep 2022 05:53 IST

 సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు తాఖీదులు జారీ

దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగాలకు వెలుపల ప్రచార ప్రకటనలు ఇవ్వకుండా నిరోధించాలని కోరుతూ కామన్‌ కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్పందనను తెలపాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర సమాచార-ప్రసారాల శాఖలకు ఈ మేరకు నోటీసులు పంపింది. తాజా పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు తొలుత విముఖత ప్రదర్శించినా, కొంతసేపు వాదప్రతివాదాల అనంతరం ప్రభుత్వాల స్పందనను కోరాలని నిశ్చయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ప్రాంతానికి కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలను ఆకర్షించడానికో.. ఇతర రాష్ట్రాల ప్రజలకు తన విజయాల గురించి చెప్పుకోవడానికో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే దాన్ని తామెలా అడ్డుకోగలమని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని