నారాయణ్‌ రాణేకు సుప్రీంలో ఎదురుదెబ్బ

ముంబయిలోని జుహు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే బంగళాను కూల్చివేయాలన్న బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా

Published : 27 Sep 2022 05:53 IST

 ఆయన బంగళాను కూల్చాల్సిందేనన్న హైకోర్టు తీర్పునకు సమర్థన

దిల్లీ: ముంబయిలోని జుహు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే బంగళాను కూల్చివేయాలన్న బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ బంగళాను ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ), కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జడ్‌) నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు కాబట్టి దాన్ని కూల్చివేయాలంటూ బృహన్‌ ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ)ని హైకోర్టు జూన్‌లో ఆదేశించింది. దీంతో రాణే కుటుంబానికి చెందిన కాల్కా రియల్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ బంగళా క్రమబద్ధీకరణకు జులైలో రెండోసారి దరఖాస్తు పెట్టుకుంది. దీన్ని పరిశీలించాలనుకుంటున్నట్లు హైకోర్టుకు బీఎంసీ ఇటీవల నివేదించింది. అయితే బీఎంసీ వాదాన్ని అంగీకరిస్తే భవిష్యత్తులో ఎవరైనాసరే అక్రమంగా భవనాలు నిర్మించి, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు పెట్టుకొనే పరిస్థితి వస్తుందన్న ఉన్నత న్యాయస్థానం.. రాణే బంగళాను కూల్చాల్సిందేనని స్పష్టం చేసింది. దీన్ని కాల్కా రియల్‌ ఎస్టేట్స్‌ సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. తాజాగా అక్కడా చుక్కెదురైంది. నిర్దిష్ట విస్తీర్ణం గల స్థలంలో గరిష్ఠంగా ఎంతమేరకు నిర్మాణం చేపట్టవచ్చో ఎఫ్‌ఎస్‌ఐ నిర్దేశిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణాలకు సీఆర్‌జడ్‌ నిబంధనలు వర్తిస్తాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని