నోట్ల రద్దు నిర్ణయంపై.. ఆరేళ్ల తర్వాత నేడు సుప్రీం విచారణ

దేశంలో నల్లధనం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకొన్న సంచలన నిర్ణయం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై

Published : 28 Sep 2022 04:56 IST

దిల్లీ: దేశంలో నల్లధనం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకొన్న సంచలన నిర్ణయం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆరేళ్ల తర్వాత విచారణకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలో అయిదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన నాలుగో రాజ్యాంగ ధర్మాసనం బుధవారం వీటిని విచారించనుంది. 2016 నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రూ.500 కొత్త నోటుతోపాటు రూ.2 వేల నోట్లను కేంద్రం చలామణీలోకి తీసుకొచ్చింది. దీనిపై కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని