‘గజగజ’లాడించాయి.. ఏనుగుల భయంతో గంటన్నర చెట్టుపైనే యువకుడు

ఎటువంటి కవ్వింపులకు పాల్పడకపోయినా ఓ ఏనుగుల మంద తనవైపు వస్తుండటంతో ఓ యువకుడు ఎత్తైన చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్న ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇడుక్కికి చెందిన సాజి.. స్థానిక చిన్నకనల్‌ ప్రాంతంలో

Updated : 28 Sep 2022 07:02 IST

ఇడుక్కి(కేరళ): ఎటువంటి కవ్వింపులకు పాల్పడకపోయినా ఓ ఏనుగుల మంద తనవైపు వస్తుండటంతో ఓ యువకుడు ఎత్తైన చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్న ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇడుక్కికి చెందిన సాజి.. స్థానిక చిన్నకనల్‌ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో కొన్ని ఏనుగులు అతని వైపు పరుగులాంటి నడకతో రావడం మొదలుపెట్టాయి. దీంతో భయాందోళనకు గురైన అతడు వెంటనే దగ్గరలోని చెట్టెక్కేశాడు. ఆ ఏనుగులు అక్కడే ఘీంకరిస్తూ ఉండిపోయాయి.

దీంతో ఆ యువకుడు ప్రాణభయంతో చెట్టుపై నుంచే దగ్గరలోని స్థానికులను రక్షించాలంటూ వేడుకున్నాడు. విషయం తెలిసిన  అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఆ ఏనుగుల గుంపును తరిమేశారు. చివరకు సుమారు గంటన్నరపాటు చెట్టుపైనే ఉన్న సాజి బతుకు జీవుడా అనుకుంటూ కిందకి దిగాడు. ఈ విషయాన్ని ఆ యువకుడు మంగళవారం తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని