8 గంటల్లో విమానం నమూనా తయారీ

కేరళ ఇడుక్కికి చెందిన ప్రిన్స్‌ భువనచంద్రన్‌ 8 గంటల్లోనే విమాన ప్రతిరూపాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. ఇనుము, ప్లాస్టిక్‌ బకెట్లు, మెటల్‌ షీట్‌లతో ఫ్లైట్‌ నమూనాను రూపొందించాడు. ఇది 12 అడుగుల పొడవు, 11

Published : 28 Sep 2022 04:56 IST

కేరళ ఇడుక్కికి చెందిన ప్రిన్స్‌ భువనచంద్రన్‌ 8 గంటల్లోనే విమాన ప్రతిరూపాన్ని తయారు చేసి ఔరా అనిపించాడు. ఇనుము, ప్లాస్టిక్‌ బకెట్లు, మెటల్‌ షీట్‌లతో ఫ్లైట్‌ నమూనాను రూపొందించాడు. ఇది 12 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంది. సైకిల్‌, బైక్‌ టైర్లను దీనికి అమర్చాడు ప్రిన్స్‌. స్కూల్‌ పార్కింగ్‌ ప్రదేశంలో పెట్టేందుకు నెడుంకందం పాఠశాల అధికారులు తనను కోరడం వల్ల ఈ విమానాన్ని తయారు చేసినట్లు అతను చెప్పాడు. ఇంతకుముందు కూడా వివిధ భారీ యంత్రాల ప్రతిరూపాలు తయారు చేశానని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని