తనతో ఉండలేని పరిస్థితులను భర్త సృష్టిస్తే.. భార్య భరణం అడగొచ్చు

భార్య తనతో ఉండలేని పరిస్థితులను భర్త ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తే.. క్రిమినల్‌ చట్టం ప్రకారం మనోవర్తి కోరే హక్కు ఆమెకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దాంపత్య బంధాన్ని పునరుద్ధరించుకోవాలంటూ కోర్టు అప్పటికే

Updated : 28 Sep 2022 05:59 IST

దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: భార్య తనతో ఉండలేని పరిస్థితులను భర్త ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తే.. క్రిమినల్‌ చట్టం ప్రకారం మనోవర్తి కోరే హక్కు ఆమెకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దాంపత్య బంధాన్ని పునరుద్ధరించుకోవాలంటూ కోర్టు అప్పటికే ఆదేశించినంత మాత్రాన.. భార్య భరణం అడగకూడదనడంలో అర్థం లేదని పేర్కొంది. న్యాయస్థానాలు అన్ని కేసులను ఒకేలా చూడకూడదని అభిప్రాయపడింది. ఆయా కేసుల్లో పరిస్థితులకు అనుగుణంగా సున్నితత్వంతో, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దాంపత్య బంధం పునరుద్ధరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌-125 కింద మనోవర్తి కోరే హక్కును ఓ మహిళ కోల్పోయినట్లు స్థానిక విచారణ న్యాయస్థానం పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని