సౌందర్య శస్త్రచికిత్సలను రిజిస్టర్డ్‌ వైద్యులే నిర్వహించాలి

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సహా సౌందర్య సంబంధ శస్త్రచికిత్సలను సరైన శిక్షణ పొందిన రిజిస్టర్డ్‌ వైద్య నిపుణులే నిర్వహించాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది. వర్క్‌షాప్‌లు లేదా యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించడం

Updated : 28 Sep 2022 06:25 IST

 జాతీయ వైద్య కమిషన్‌ మార్గదర్శకాలు

దిల్లీ: హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సహా సౌందర్య సంబంధ శస్త్రచికిత్సలను సరైన శిక్షణ పొందిన రిజిస్టర్డ్‌ వైద్య నిపుణులే నిర్వహించాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది. వర్క్‌షాప్‌లు లేదా యూట్యూబ్‌లో వీడియోలు వీక్షించడం ద్వారా ఇలాంటివాటిని ప్రయత్నించరాదని స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అందులోని ముఖ్యాంశాలవీ..

* సరిపడా మౌలిక వసతులు, ఏదైనా సమస్యలు ఎదురైతే ఎదుర్కోవడానికి అవసరమైన మానవ వనరులు ఉన్న కేంద్రాల్లోనే ఇలాంటి శస్త్రచికిత్సలను నిర్వహించాలి.

* ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించే కేంద్రాలను డే కేర్‌ సెంటర్లు లేదా ఆసుపత్రులుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి.

* వైద్య నేపథ్యమున్న నర్సులు, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు మాత్రమే సహాయకులుగా ఉండాలి. రిజిస్టర్డ్‌ వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వారు విధులు నిర్వహించాలి.

* ఫీజుల తగ్గింపు, తప్పుడు హామీలతో ప్రకటనలు ఇవ్వడం వంటివి చేయకూడదు. శస్త్రచికిత్స, దానివల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి రోగికి ముందుగానే తెలియజేయాలి.

* హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రక్రియను శస్త్రచికిత్సల్లో శిక్షణ పొందిన ఎంసీహెచ్‌/డీఎన్‌బీ ప్లాస్టిక్‌ సర్జరీ, ఎండీ/డీఎన్‌బీ డెర్మటాలజీ నిపుణులు నిర్వహించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని