దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక టీచర్లు తప్పనిసరి

ఇకపై ప్రతి పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక టీచర్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు విద్యాహక్కు చట్టం-2009కి సవరణలు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు

Published : 28 Sep 2022 05:05 IST

విద్యాహక్కు చట్టానికి కేంద్రం సవరణ

ఈనాడు, దిల్లీ ఇకపై ప్రతి పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక టీచర్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు విద్యాహక్కు చట్టం-2009కి సవరణలు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 10 మంది దివ్యాంగులకోసం, 6 నుంచి 8వ తరగతికి అయితే ప్రతి 15 మంది కోసం ఒక ప్రత్యేక టీచర్‌ ఉండాలని స్పష్టంచేసింది. ఒకవేళ ఈ సంఖ్య ప్రకారం ప్రత్యేక టీచర్లు దొరక్కపోయినప్పుడు, ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తున్నప్పుడు కొన్ని పాఠశాలల్ని క్లస్టర్‌గా గుర్తించి అందులో ఉన్న దివ్యాంగుల పిల్లల నిష్పత్తికి సరిపోయేలా ప్రత్యేక ఉపధ్యాయుల్ని నియమించాలని స్పష్టంచేసింది. అయితే ఈ క్లస్టర్‌లో స్కూళ్ల సంఖ్య 4కి మించకూడదని, అలాగే వాటి మధ్య దూరం 5 కిలోమీటర్లు దాటకూడదని షరతు విధించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని