బరాబర్‌, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం యత్నాలు

బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో గల బరాబర్‌, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ

Published : 29 Sep 2022 05:53 IST

యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భారత పురావస్తు శాఖ నిర్ణయం

పట్నా, దిల్లీ: బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లాలో గల బరాబర్‌, నాగార్జునుడి గుహలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదించాలని భారత పురావస్తు శాఖ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా/ఏఎస్‌ఐ) నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అధికారులు వెల్లడించారు. ‘‘మన దేశంలో మనుగడలో గల పురాతనమైన తొలచిన రాతి గుహలు ఇవి. వీటిని మౌర్యుల కాలం(321 బీసీ నుంచి 185 బీసీ మధ్య)లో రూపొందించారు’’ అని పురావస్తు శాస్త్రవేత్త ఒకరు పేర్కొన్నారు. మఖ్దంపుర్‌ ప్రాంతంలో బరాబర్‌ కొండలు నాలుగు గుహల సముదాయాన్ని కలిగి ఉన్నాయి. వాటినే బరాబర్‌ లేదా లోమస్‌ రుషి, సుధామ, విశ్వకర్మ, కరణ్‌ చౌపర్‌ గుహలుగా పేర్కొంటారు. వీటికి రెండు కిలోమీటర్ల దూరంలో గల నాగార్జునుడి కొండల్లో మూడు చెక్కిన గుహలు ఉన్నాయి. వీటిని కూడా మౌర్యుల కాలం నాటివిగా గుర్తించారు.

బాంధవ్‌గఢ్‌లో పురాతన దేవాలయాలు
మరోపక్క మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్‌లో జరిపిన పరిశోధనల్లో పురాతన గుహలు, దేవాలయాలు, బౌద్ధకట్టడాలు; మథుర, కౌశంబి వంటి ప్రాచీన నగరాల పేర్లతో కూడిన కుడ్య శాసనాలను ఏఎస్‌ఐ గుర్తించిందని అధికారులు బుధవారం ప్రకటించారు. 1938 తరువాత తొలిసారిగా బాంధవ్‌గఢ్‌ పులుల అభయారణ్యంలో 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏఎస్‌ఐ నెలకు పైగా తన పరిశోధన సాగించిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని