Spoons in stomach: పొట్టలో 63 స్పూన్లు.. ఆపరేషన్‌ చేసి తీసిన వైద్యులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 63 స్పూన్లను వెలికితీశారు వైద్యులు. మన్సూరాపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్‌ అనే వ్యక్తి మత్తు

Updated : 29 Sep 2022 08:43 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 63 స్పూన్లను వెలికితీశారు వైద్యులు. మన్సూరాపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్‌ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ఆ అలవాటును మాన్పించేందుకు కుటుంబసభ్యులు అతడిని షామ్‌లీలోని డ్రగ్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించారు. అక్కడ విజయ్‌కు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్‌ చేసిన వైద్యులు అతడి కడుపులో నుంచి 63 స్పూన్లు బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. డ్రగ్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌ సిబ్బందే విజయ్‌తో బలవంతంగా చెంచాలను మింగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని