Harjot Kaur: ‘ఫ్రీ అంటే.. కండోమ్స్‌ కూడా కావాలంటారు’

‘కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈరోజు రుతు రుమాళ్లు (శానిటరీ నాప్‌కిన్స్‌) ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ పోతే.. చివరకు కుటుంబ నియంత్రణ మాటకొస్తే కండోమ్స్‌ కూడా

Updated : 29 Sep 2022 07:10 IST

రుతు రుమాళ్లు అడిగిన విద్యార్థినులతో బిహార్‌ ఐఏఎస్‌ అధికారిణి

పట్నా: ‘కోరికలకు ఓ అంతు అనేది ఉందా? ఈరోజు రుతు రుమాళ్లు (శానిటరీ నాప్‌కిన్స్‌) ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకొంటూ పోతే.. చివరకు కుటుంబ నియంత్రణ మాటకొస్తే కండోమ్స్‌ కూడా ఉచితంగా అడుగుతారు’ అంటూ బిహార్‌ ఐఏఎస్‌ అధికారిణి హర్‌జోత్‌ కౌర్‌ చెప్పిన సమాధానం విని ఆ విద్యార్థినులు బిత్తరపోయారు. పాఠశాల విద్యార్థినులతో ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బిహార్‌ ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ హర్‌జోత్‌ కౌర్‌ మాట్లాడుతుండగా.. ‘ప్రభుత్వం ఉచితంగా ఎన్నో ఇస్తోంది. 20 - 30 రూపాయల విలువ చేసే రుతు రుమాళ్లు మాకు ఇవ్వలేరా?’ అని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మహిళా ఉన్నతాధికారి పై విధంగా స్పందించారు. విద్యార్థినులు కూడా వెనక్కు తగ్గలేదు. ‘ఓట్ల కోసం వచ్చినపుడు ఎన్నో హామీలు ఇస్తారు కదా?’ అని నిలదీశారు. దీంతో హర్‌జోత్‌ కౌర్‌ ‘అయితే ఓట్లు వేయకండి. పాకిస్థాన్‌లా మారిపోండి’ అంటూ విద్యార్థులపై మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని