కూలి చేసైనా భార్యాబిడ్డల్ని పోషించాలి

కూలిపని చేస్తూ అయినా భార్యను, మైనర్‌ పిల్లల్ని పోషించడం భర్త పవిత్ర విధి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్తవారింటిని విడిచిపెట్టి పిల్లలతో సహా బయటకు రావాల్సి వచ్చినవారు పడే వేదన,

Published : 29 Sep 2022 05:53 IST

అది భర్త పవిత్ర విధి: సుప్రీంకోర్టు

దిల్లీ: కూలిపని చేస్తూ అయినా భార్యను, మైనర్‌ పిల్లల్ని పోషించడం భర్త పవిత్ర విధి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్తవారింటిని విడిచిపెట్టి పిల్లలతో సహా బయటకు రావాల్సి వచ్చినవారు పడే వేదన, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే నేర శిక్షాస్మృతిలో సెక్షన్‌ 125ను చేర్చారని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలాత్రివేది ధర్మాసనం తెలిపింది. భార్య శీలాన్ని శంకిస్తూ, తమకు పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలన్న భర్త ప్రతినెలా ఆమెకు రూ.10,000 చొప్పున మనోవర్తి చెల్లించాలని ఆదేశించింది. బిడ్డ కోసం నెలకు రూ.6,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఇది అదనమని స్పష్టంచేసింది. శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉన్నట్లయితే కూలీనాలీ చేసైనా కుటుంబాన్ని పోషించాలని తెలిపింది. వ్యాపారం మూతపడడం వల్ల తనకు సంపాదన లేదనీ, పైగా భార్య తనంతట తానుగా అత్తవారింటి నుంచి వెళ్లిపోయిందని భర్త చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. భార్య వివరణను కుటుంబ న్యాయస్థానం నమ్మకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కుటుంబ న్యాయస్థానం, పంజాబ్‌-హరియాణా హైకోర్టు చాలా యథాలాపంగా ఉత్తర్వులు ఇచ్చాయని తప్పుపట్టింది. 1991లో వివాహం చేసుకున్న జంటకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని