టీనేజీ పిల్లలకు బుడ్డోడి పాఠాలు!

ఆ బాలుడి వయసు 8 ఏళ్లు. చదివేది మూడో తరగతి. కానీ..పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మ్యాథ్స్‌ గురూగా పేరుగాంచాడు.  బిహార్‌లోని

Published : 30 Sep 2022 04:28 IST

ఆ బాలుడి వయసు 8 ఏళ్లు. చదివేది మూడో తరగతి. కానీ..పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మ్యాథ్స్‌ గురూగా పేరుగాంచాడు.  బిహార్‌లోని పట్నా జిల్లా మసౌడీలోని చపౌర్‌ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాబీ రాజ్‌ తల్లిదండ్రులు రాజ్‌ కుమార్‌, చంద్రప్రభా కుమారి. వీరు 2018లో ఊళ్లో ఓ పాఠశాలను ప్రారంభించారు. కరోనా మహమ్మారి కాలంలో దానిని చాలాకాలం మూసేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వారు ట్యూషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. గణితంపై బాబీరాజ్‌కు గల ఆసక్తిని గమనించిన అతడి తల్లిదండ్రులు.. ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అతడితోనే ట్యూషన్‌కు వచ్చే వారికి పాఠాలు చెప్పించడం మొదలుపెట్టారు. దీంతో ఆ బాలుడు ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు అత్యంత సరళంగా, అర్థమయ్యేలా గణితం పాఠాలు చెప్పగలుగుతున్నాడు. శాస్త్రవేత్త కావాలనుకుంటున్న ఆ చిచ్చరపిడుగు నైపుణ్యానికి ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఫిదా అయి గతంలో పట్నా వచ్చినప్పుడు.. బాబీని కలిశారు. అతడి విద్య కోసం ఆర్థిక సాయం చేస్తానని మాట ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని