హరియాణాలో భారీ సఫారీ పార్కు

హరియాణాలో అతిపెద్ద రక్షిత అటవీ సఫారీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఆరావళి ప్రాంతంతోపాటు గురుగ్రాం, నుహ్‌ జిల్లాల్లోని మొత్తం 10 వేల ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు

Published : 30 Sep 2022 04:28 IST

10 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

చండీగఢ్‌: హరియాణాలో అతిపెద్ద రక్షిత అటవీ సఫారీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఆరావళి ప్రాంతంతోపాటు గురుగ్రాం, నుహ్‌ జిల్లాల్లోని మొత్తం 10 వేల ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఆఫ్రికా వెలుపల ఇటువంటి ప్రాజెక్టుల్లో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకూ 2000 ఎకరాల్లోని షార్జా సఫారీ అతిపెద్ద పార్కుగా ఖ్యాతి గాంచింది. దీనిని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆరంభించారు. ప్రతిపాదిత ఆరావళి పార్కు దాని కంటే అయిదు రెట్లు పెద్దదిగా ఉండనుంది. ఇందులో ‘సరీ సృపాలు, ఉభయచరాలతో కూడిన ప్రదర్శన, పక్షుల పార్కు, పులుల కోసం నాలుగు ప్రాంతాలు, శాకాహార జంతువుల కోసం విశాల ప్రాంతం, విదేశీ పక్షులు, జంతువుల కోసం ప్రత్యేక ప్రాంతం, భూగర్భ జల ప్రపంచం, ప్రకృతి బాటలు, పర్యాటకులు-పర్యటన ప్రాంతాలు, బొటానికల్‌ గార్డెన్స్‌, బయోమ్‌లు, భూమధ్యరేఖ-ఉష్ణమండల-తీరప్రాంత-ఎడారి ప్రాంతాలు’ ఉండనున్నాయి.
ఈ పార్కు ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. షార్జా సఫారీని సందర్శించారని ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. హరియాణాలోని ఎన్‌సీఆర్‌ ప్రాంతం అటవీ సఫారీ పార్కు అభివృద్ధికి అత్యంత సానుకూలమైందని గురువారం ఖట్టర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని