గరుడ... స్మగ్లర్ల గుండెల్లో దడ!

మాదకద్రవ్యాల సరఫరా ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో వారం రోజుల క్రితం మొదలు పెట్టిన దాడులు సత్ఫలితాలనిస్తున్నాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ),

Published : 30 Sep 2022 04:28 IST

 మాదకద్రవ్యాల సరఫరాపై సీబీఐ ఉక్కుపాదం

127 కేసుల్లో 175 మంది అరెస్టు

దిల్లీ/ముంబయి: మాదకద్రవ్యాల సరఫరా ముఠాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో వారం రోజుల క్రితం మొదలు పెట్టిన దాడులు సత్ఫలితాలనిస్తున్నాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ), ఇంటర్‌పోల్‌ సహా పలు రాష్ట్రాల పోలీసుల సాయంతో 6,600 మంది నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. 127 కేసుల్ని నమోదు చేసిన సీబీఐ అధికారులు...175 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ గరుడలో భాగంగా సీబీఐ అధికారులు హిందూ మహాసముద్రం మీదుగా సాగే మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. పంజాబ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, మహారాష్ట్ర పోలీసులు, ఎన్సీబీ, సీబీఐ అధికారులు సంయుక్తంగా ‘ఆపరేషన్‌ గరుడ’లో పాల్గొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts