జడ్జీలను యంత్రాల్లా పనిచేయించలేం: రిజిజు

న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు, న్యాయమూర్తులపై పడుతున్న భారానికి మధ్య సమతౌల్యం సాధించాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు

Published : 30 Sep 2022 04:28 IST

దిల్లీ: న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు, న్యాయమూర్తులపై పడుతున్న భారానికి మధ్య సమతౌల్యం సాధించాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.8 కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయనీ, జడ్జీలను యంత్రాల్లా పనిచేయించలేమని వ్యాఖ్యానించారు. ‘న్యాయ వ్యవస్థ, న్యాయవిద్య భారతీయీకరణ’ అనే అంశంపై గురువారం దిల్లీ విశ్వవిద్యాలయం, జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఉమ్మడిగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఒకపక్క మనం ఆధునిక న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. మరోపక్క సామాన్యులకు న్యాయం అందడం కష్టమవుతోందని మనమే అంటున్నాం. దేశంలో కేవలం 15 నెలల్లో పెండింగు కేసులు 60 లక్షల మేర పెరిగిపోయాయి. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి జడ్జి 50-60 కేసులను పరిశీలించాల్సి వస్తోంది’ అని మంత్రి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని