హైకోర్టు న్యాయమూర్తులపై దాడికి కుట్ర

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) గురించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వర్గాలు తాజాగా సంచలన విషయాలను బయటపెట్టాయి. దేశంలో హైకోర్టు న్యాయమూర్తులు,

Published : 30 Sep 2022 05:33 IST

సీనియర్‌ పోలీసు అధికారులపైనా..

తమిళనాడులో యూదులపై  హింసకూ వ్యూహరచన

పీఎఫ్‌ఐ కుట్రను బయటపెట్టిన ఎన్‌ఐఏ

దిల్లీ: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) గురించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వర్గాలు తాజాగా సంచలన విషయాలను బయటపెట్టాయి. దేశంలో హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ పోలీసు అధికారులపై దాడులు జరిపేందుకు ఆ సంస్థ కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. 2047 వరకు ఏం చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను పీఎఫ్‌ఐ ఇప్పటికే రూపొందించుకుందని.. విద్వేష నేరాలు, లక్షిత దాడులకు పాల్పడేలా అందులో ప్రణాళికలు ఉన్నాయని తెలిపాయి. ‘‘దాడులకు పాల్పడేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా దక్షిణాదికి చెందిన 15 మంది యువకులను పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు ఎంపిక చేసుకున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ పోలీసు అధికారులు, అహ్మదీయ శాఖకు చెందిన ముస్లింలపై దాడులకు పాల్పడి భయానక వాతావరణం సృష్టించాలన్నది వాటి వ్యూహం. ఈ మేరకు పేలుడు పదార్థాలు, ఆయుధాలనూ సేకరించుకున్నాయి. ఏటా వందల మంది ఇజ్రాయెల్‌ యువకులు తమ దేశంలో సైనిక శిక్షణ తీసుకున్న తర్వాత సెలవుల్లో తమిళనాడు దిండిగుల్‌ జిల్లాలోని వట్టక్కనల్‌ హిల్‌స్టేషన్‌కు వస్తారు. అక్కడ వారిపై దాడులు చేయాలని పీఎఫ్‌ఐ సభ్యులు కుట్ర పన్నారు’’ అని వారు వివరించారు.

తుర్కియేలోని ఆ సంస్థతో సన్నిహిత సంబంధాలు

సిరియాలోని అల్‌ఖైదా అనుబంధ జిహాదీలకు ఆయుధాలను చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తుర్కియేలోని ‘మానవహక్కులు, స్వేచ్ఛ, మానవత్వానికి చేయూత (ఐహెచ్‌హెచ్‌)’ అనే సంస్థతో పీఎఫ్‌ఐకి సంబంధాలున్నట్లు నిఘా అధికారులు వెల్లడించారు. పీఎఫ్‌ఐ జాతీయ మండలి సభ్యులైన అబ్దుల్‌ రహిమాన్‌, ప్రొఫెసర్‌ పి.కోయాలకు గతంలో ఆ సంస్థ ఇస్తాంబుల్‌లో ఆశ్రయం ఇచ్చినట్లు స్టాక్‌హోం నుంచి పనిచేసే నిఘాసంస్థ కనిపెట్టిందన్నారు. ఆగ్నేయాసియాలోని ముస్లింవర్గాలకు నేతగా మారడానికి తుర్కియే అధ్యక్షుడు ఎర్దొగాన్‌ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే పీఎఫ్‌ఐకి చేయూత ఇస్తున్నట్లు చెప్పారు.

‘హర్తాళ్‌ హింసకు పీఎఫ్‌ఐదే బాధ్యత’

కొచ్చి: కేరళలోని కొచ్చిలో ఈనెల 23న నిర్వహించిన హర్తాళ్‌ సందర్భంగా చెలరేగిన హింసకు పీఎఫ్‌ఐ బాధ్యత వహించాలని కేరళ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేరళ ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5.2 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆ సంస్థను ఆదేశించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts