Nitin Gadkari: నిరుపేదలున్న సంపన్న దేశం మనది: గడ్కరీ

మన దేశం ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ ప్రజలు క్షుద్బాధ,

Updated : 30 Sep 2022 08:56 IST

నాగ్‌పుర్‌: మన దేశం ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ ప్రజలు క్షుద్బాధ, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, అధిక ధరలు వంటి సమస్యలతో సతమతమవుతున్నారని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ధనిక, పేద ప్రజల మధ్య అంతరం పెరిగిపోతోందని, దీనిని తగ్గించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆరెస్సెస్‌తో భావసారూప్యమున్న భారత్‌ వికాస్‌ పరిషద్‌ గురువారం నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక అంతరాలను తగ్గించడానికి విద్య, ఆరోగ్యం, సేవల రంగాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని