పడగను ముద్దాడితే కాటేయనా!

‘పుట్టలో వేలెడితే కుట్టనా?’ అని కథలో చీమ అడిగినట్టే.. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగిన ఓ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ నాగుపామును పట్టుకున్న పాముల సంరక్షకుడు అందరూ చూస్తుండగా దాన్ని పడగపై ముద్దాడాడు.

Published : 01 Oct 2022 06:05 IST

‘పుట్టలో వేలెడితే కుట్టనా?’ అని కథలో చీమ అడిగినట్టే.. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగిన ఓ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ నాగుపామును పట్టుకున్న పాముల సంరక్షకుడు అందరూ చూస్తుండగా దాన్ని పడగపై ముద్దాడాడు. దీంతో ఆ సర్పం చటుక్కున వెనక్కు మళ్లి అతడి పెదవిపై కాటు వేసింది. పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టిన సంరక్షకుడు అలెక్స్‌ ఆ తర్వాత ఆస్పత్రికి చేరుకున్నాడు. అదృష్టం బాగుంది కాబోలు.. చికిత్స పొందుతూ అతడు కోలుకొంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని