నేటి నుంచి రైల్వేశాఖ కొత్త కాలపట్టిక

రైల్వేశాఖ అఖిల భారత కొత్త కాలపట్టికను అక్టోబరు 1 నుంచి అమలులోకి తీసుకురానుంది. ది ‘ట్రైన్స్‌ అట్‌ ఏ గ్లాన్స్‌’ (టీఏజీ/రైళ్ల రాకపోకల విహంగవీక్షణం) పేరిట రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైటు

Updated : 01 Oct 2022 06:43 IST

దిల్లీ: రైల్వేశాఖ అఖిల భారత కొత్త కాలపట్టికను అక్టోబరు 1 నుంచి అమలులోకి తీసుకురానుంది. ది ‘ట్రైన్స్‌ అట్‌ ఏ గ్లాన్స్‌’ (టీఏజీ/రైళ్ల రాకపోకల విహంగవీక్షణం) పేరిట రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైటు ‌www.indianrailways.gov.in.లో దీనిని విడుదల చేస్తామని అధికారులు శుక్రవారం వెల్లడించారు. 2021-22 కాలంలో ప్రవేశపెట్టిన 106 కొత్త సర్వీసులకు, వందేభారత్‌ రైళ్లకు ఇందులో చోటు కల్పించారు. ఇదేవిధంగా 212 సర్వీసులను పొడిగించగా, 24 సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచిన వివరాలు సైతం  పొందుపరిచారు. రైళ్ల రాకపోకల్లో కచ్చితమైన సమయాన్ని పాటించేలా కాలపట్టికలో అవసరమైన మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 3,240 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి తోడు 3 వేల ప్యాసింజర్‌ రైళ్లు, 5,660 సబర్బన్‌ రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లలో నిత్యం 2.23 కోట్ల జనం రాకపోకలు సాగిస్తున్నారు. కాలపట్టిక డిజిటలైజేషనులో భాగంగా ‘ఈ-బుక్‌’ రూపంలోనూ దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషను (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్లు www.irctc.co.in.. www.irctctourism.com నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts