కశ్మీర్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం

జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గురేజ్‌ సెక్టార్‌లో భారత భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏడు ఏకే-47 తుపాకులు

Published : 01 Oct 2022 06:27 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గురేజ్‌ సెక్టార్‌లో భారత భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏడు ఏకే-47 తుపాకులు ఉన్నాయి. నియంత్రణ రేఖ అవతలి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద ముఠాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని అధికారులు తెలిపారు. కశ్మీర్‌ లోయలో విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఈ ఆయుధాలను చేరవేశారని చెప్పారు. వారి కుట్రలను భారత భద్రతా దళాలు వమ్ము చేశాయని పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు సెప్టెంబరు 27న భారత సైన్యం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను చేపట్టిందని వివరించారు. మూడు రోజుల సోదాల అనంతరం ఒక రహస్య స్థావరాన్ని గుర్తించినట్లు తెలిపారు. అందులో ఈ ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో రెండు చైనా తయారీ పిస్తోళ్లు, 13 గ్రెనేడ్లు, 21 తూటా అరలు, నాలుగు పిస్టల్‌ మ్యాగజైన్లు, ఏకే తుపాకుల్లో వాడే 1190 తూటాలు, 132 తూటాలు ఉన్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts