SARS-CoV-2: వైరస్‌కు వైరస్‌తోనే కట్టడి
కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్‌ను కట్టడి చేయడానికి ఆ సూక్ష్మజీవినే సాధనంగా ఉపయోగించుకునే వినూత్న విధానాన్ని అమెరికాలోని ‘ద స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు.
దిల్లీ: కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్‌ను కట్టడి చేయడానికి ఆ సూక్ష్మజీవినే సాధనంగా ఉపయోగించుకునే వినూత్న విధానాన్ని అమెరికాలోని ‘ద స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఇందుకోసం వారు ఎన్ఎంటీ5 అనే సరికొత్త ఔషధాన్ని కనుగొన్నారు. కరోనాలో కొత్తగా వస్తున్న వేరియంట్లపైనా ఇది సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని వివరించారు. ఎన్ఎంటీ5లో రెండు కీలకమైన లక్షణాలు ఉన్నాయి. 1. ఇది వైరస్ ఉపరితలంపై ఉన్న ఒక రంధ్రాన్ని గుర్తించి, దానికి అంటుకోవడం. 2. నైట్రోగ్లిజరిన్ను ఉపయోగించుకొని మానవుల్లోని ఏసీఈ2 గ్రాహకాన్ని తాత్కాలికంగా రసాయనపరంగా మార్చివేయడం. కరోనా వ్యాప్తి కట్టడికి ఈ రెండు లక్షణాలు బాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలుత ఈ మందు.. కరోనా వైరస్‌పై రసాయన పూతను వేస్తుంది. ఫలితంగా అది మానవ ఏసీఈ2 రెసెప్టార్‌ను తాత్కాలికంగా మార్చేస్తుంది. మన కణాల్లోకి ప్రవేశించడానికి ఈ భాగాన్నే వైరస్ ఉపయోగించుకుంటుంది. ఈ మందును కలిగిన వైరస్ తన సమీపానికి వస్తే కణంలోకి ప్రవేశించే మార్గాన్ని ఈ రెసెప్టార్ మూసేస్తుంది. దగ్గరకు రాకుంటే తన పని తాను చేసుకుపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం