నా భార్య ‘పురుషుడు’

ఓ వ్యక్తి తన భార్యతో ఆరేళ్లు కాపురం చేశాక ఆమె మహిళ కాదు పురుషుడు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Updated : 02 Oct 2022 06:07 IST

పెళ్లైన ఆరేళ్లకు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భర్త

ఓ వ్యక్తి తన భార్యతో ఆరేళ్లు కాపురం చేశాక ఆమె మహిళ కాదు పురుషుడు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్వాలియర్‌కు చెందిన యువకుడికి మురైనాకు చెందిన యువతితో 2016లో వివాహం జరిగింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు. ఆ యువకుడు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. ఆరేళ్ల తర్వాత తన భార్య మహిళ కాదని పురుషుడని భర్త ఆరోపించాడు. తనను మోసం చేసిందంటూ మహిళతో పాటు ఆమె తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చీటింగ్‌ కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్‌ని తోసిపుచ్చింది. మరోవైపు, తనకు హార్మోన్‌ సమస్య ఉండడం వల్లే ఇలా ఉన్నానని.. ఈ సమస్యకు చికిత్స సైతం తీసుకుంటున్నానని భార్య తెలిపింది. అయినా అనుమానం తీరని భర్త వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో భార్య స్థానంలో ఉన్నది పురుషుడని తేలింది. దీనిపై విచారించిన కుటుంబ న్యాయస్థానం వివాహాన్ని రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని