Love: నిష్కల్మష ప్రేమ.. ప్రియుడి రెండు కాళ్లు చచ్చుబడిపోయినా..

రెండు కాళ్లు చచ్చుబడి పోయిన ప్రియుడినే వివాహమాడిన ఓ యువతి నిష్కల్మష ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

Updated : 02 Oct 2022 08:38 IST

రెండు కాళ్లు చచ్చుబడి పోయిన ప్రియుడినే వివాహమాడిన ఓ యువతి నిష్కల్మష ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని సవనేరి గ్రామానికి చెందిన ప్రకాశ్‌ (25), వల్లియమ్మాల్‌ పురానికి చెందిన దివ్య(22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో ప్రకాశ్‌ రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముకకు దెబ్బ తగలడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రకాశ్‌తో పెళ్లి వద్దంటూ తన కుటుంబసభ్యులు ఎంతగా నచ్చజెప్పినా దివ్య పట్టించుకోలేదు. గత నెల 20న వరుడి కుటుంబం సమక్షంలో దివ్య, ప్రకాశ్‌ల వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రకాశ్‌ ఇంటికి చేరుకున్న వధువు తరఫు కుటుంబసభ్యులు అక్కడున్న వారిపై దాడిచేసి దివ్యను తీసుకుపోయారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశ్‌.. ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. దివ్య కుటుంబంపై చర్యలు తీసుకొని తనను, తన భార్యను కలపాలని కోరుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని