గుజరాత్‌లో వాళ్ల ఆటలు సాగవు : స్మృతి ఇరానీ

‘అమేథీ ఎంపీ అయిన నేను గుజరాత్‌ కోడల్ని. అయినా హిందీలో మాట్లాడుతున్నా. ఎందుకంటే దిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లకు గుజరాతీ తెలియదు. గుజరాత్‌ మహిళలకు ఏదీ మంచో.. ఏది చెడో తెలుసు. ఇటుకలు విసిరితే రాళ్లతో ఎలా జవాబు చెప్పాలో కూడా తెలుసు.

Updated : 02 Oct 2022 06:19 IST

అహ్మదాబాద్‌: ‘అమేథీ ఎంపీ అయిన నేను గుజరాత్‌ కోడల్ని. అయినా హిందీలో మాట్లాడుతున్నా. ఎందుకంటే దిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లకు గుజరాతీ తెలియదు. గుజరాత్‌ మహిళలకు ఏదీ మంచో.. ఏది చెడో తెలుసు. ఇటుకలు విసిరితే రాళ్లతో ఎలా జవాబు చెప్పాలో కూడా తెలుసు. దిల్లీ కలల వ్యాపారి ఆటలు ఇక్కడ సాగవు’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలను దృష్టిలో పెట్టుకొని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజపా మహిళా విభాగం ఇక్కడ నిర్వహించిన ‘హలో కమల్‌శక్తి’ సదస్సులో మంత్రి మాట్లాడారు. నర్మదా నీళ్లు ఇక్కడి ప్రజలకు అవసరమైనపుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమించినవాళ్లకు పూలమాలలు వేసినవాళ్లు ఎవరో గుజరాత్‌ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని అన్నారు. దిల్లీలో ఇప్పటికీ 690 మురికివాడలు నీటిసమస్యతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ‘నల్‌ సే జల్‌’ పథకం ద్వారా కోట్లాది ప్రజలకు నీటివసతి కల్పించిన చరిత్ర ప్రధాని నరేంద్ర మోదీ సొంతమన్నారు. ఈ సారి కూడా గుజరాతీ మహిళలు కమలం మీట నొక్కుతారని స్మృతి ఇరానీ భరోసా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని