రాజస్థాన్‌లో శాంతి, అహింస శాఖ

మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం శాంతి, అహింస శాఖను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్‌ చేసిన ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్ర ఆమోదం తెలిపారు.

Published : 02 Oct 2022 05:27 IST

కేబినెట్‌ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం

జైపుర్‌: మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం శాంతి, అహింస శాఖను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్‌ చేసిన ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్ర ఆమోదం తెలిపారు. ఈ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా మంత్రివర్గం ఇటీవల ఒక తీర్మానం చేసింది. గాంధీ సందేశాన్ని రాష్ట్రంలో అన్ని వర్గాలకూ చేరవేసి, పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే ఈ శాఖ లక్ష్యం. ప్రధానంగా.. మహాత్ముడు ప్రబోధించిన సత్యం, అహింస సందేశాలను యువత, చిన్నారుల వద్దకు తీసుకెళుతుంది. ఈ దిశగా కార్యక్రమాలు చేపడుతుంది. కళలు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుంది. దళితుల అభ్యున్నతి కోసం సామాజిక న్యాయశాఖతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు