ఐదు గ్రామాలను వణికించిన శునకం

పంజాబ్‌ గురుదాస్‌పుర్‌లో ఒక శునకం.. ఐదు గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దినానగర్‌ సమీపంలోని ఐదు గ్రామాల్లోని 12 మందిపై ఆ పెంపుడు శునకం దాడి చేసింది. మొదట.. తంగోషా గ్రామంలోని ఇద్దరు కూలీలపై దాడి చేసింది.

Published : 02 Oct 2022 05:27 IST

12 మందిపై దాడి

పంజాబ్‌ గురుదాస్‌పుర్‌లో ఒక శునకం.. ఐదు గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దినానగర్‌ సమీపంలోని ఐదు గ్రామాల్లోని 12 మందిపై ఆ పెంపుడు శునకం దాడి చేసింది. మొదట.. తంగోషా గ్రామంలోని ఇద్దరు కూలీలపై దాడి చేసింది. చాకచక్యంగా వ్యవహరించిన కూలీలు.. పెంపుడు శునకం మెడకు ఉన్న గొలుసును పట్టుకొని నిలువరించారు. ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకున్న శునకం.. రాత్రి వేళ గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ దిలీప్‌ కుమార్‌(60) అనే వ్యక్తిపై దాడి చేసింది. అలా ఒకరి తర్వాత ఒకరిపై మొత్తం 11 మందిపై దాడిచేసి గాయపరిచింది. ఆ తర్వాత చౌహానా గ్రామానికి చెందిన విశ్రాంత సైనికుడు కెప్టెన్‌ శక్తి సింగ్‌ను కరిచింది. ఆయన ధైర్యం కోల్పోకుండా శునకం 2 చెవులను పట్టుకొని నిలువరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న కొందరు స్థానికులు శునకాన్ని కర్రలతో కొట్టిచంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని