అమ్మో ఇంత దంతమా.. వ్యక్తి నోట్లో 37.5 మిల్లీమీటర్ల పన్ను!

జమ్మూ-కశ్మీర్‌లోని బడ్‌గామ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నోట్లో నుంచి వైద్యులు ‘భారీ పన్ను’ను బయటకు తీశారు. 37.5 మిల్లీమీటర్ల పొడవు ఉన్న ఈ దంతం ప్రపంచంలోనే అతి పెద్ద దంతం కావొచ్చని చెబుతున్నారు.

Updated : 04 Oct 2022 07:03 IST

జమ్మూ-కశ్మీర్‌లోని బడ్‌గామ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నోట్లో నుంచి వైద్యులు ‘భారీ పన్ను’ను బయటకు తీశారు. 37.5 మిల్లీమీటర్ల పొడవు ఉన్న ఈ దంతం ప్రపంచంలోనే అతి పెద్ద దంతం కావొచ్చని చెబుతున్నారు. ఎస్‌డీహెచ్‌ బీడ్‌వా ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి నోటి నుంచి ఈ పన్నును బయటకు తీశామని వైద్యుడు జావైద్‌ అహ్మద్‌ వెల్లడించారు. 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చాడని, అతడికి ఎక్స్‌రే తీయగా.. దంతం చాలా పెద్దగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. బాధితుడి అనుమతితో శనివారం గంటన్నరసేపు శస్త్రచికిత్స నిర్వహించి ఆ దంతాన్ని బయటకు తీశామని చెప్పారు. గిన్నిస్‌ పుస్తకంలో నమోదైన రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పన్ను సైజు 37.2 మిల్లీమీటర్లు. ప్రస్తుతం బయటకు తీసిన పన్ను అంతకంటే పొడవుగా ఉంది. అందువల్ల ఈ పన్ను గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకునే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని