ఉచితాలకు కళ్లెం వేయాలి

ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో రాష్ట్రాలు పరస్పరం పోటీపడుతున్న నేపథ్యంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నివేదిక ఒకటి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పథకాల భారాన్ని రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో లేదా ఆయా రాష్ట్రాల సొంత పన్ను వసూళ్లలో 1 శాతానికి పరిమితం చేయాలంది.

Updated : 04 Oct 2022 06:04 IST

ఆ పథకాలను రాష్ట్రాల జీడీపీలో 1 శాతానికి పరిమితం చేయాలి: ఎస్‌బీఐ నివేదిక 

ముంబయి: ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో రాష్ట్రాలు పరస్పరం పోటీపడుతున్న నేపథ్యంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నివేదిక ఒకటి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పథకాల భారాన్ని రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో లేదా ఆయా రాష్ట్రాల సొంత పన్ను వసూళ్లలో 1 శాతానికి పరిమితం చేయాలంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ఒక కమిటీకి సూచనలు చేసింది. ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ ఈ నివేదికను రూపొందించారు. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌లో వార్షిక పింఛను భారం రూ.3 లక్షల కోట్ల చొప్పున ఉందని పేర్కొన్నారు. ఝార్ఖండ్‌ సొంత పన్నుల రెవెన్యూతో పోలిస్తే ఇది 217% అధికం. రాజస్థాన్‌లో అది 190% ఛత్తీస్‌గఢ్‌ విషయంలో 207 శాతం ఎక్కువ.

* మరికొన్ని రాష్ట్రాలు కూడా పాత పింఛన్‌ వ్యవస్థను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ లెక్కన సొంత పన్ను రాబడితో పోలిస్తే పింఛన్ల భారం హిమాచల్‌ప్రదేశ్‌ (450 శాతం), గుజరాత్‌ (138 శాతం), పంజాబ్‌ (242 శాతం)లో పెరగనుంది.

* రాష్ట్ర ప్రభుత్వాల పూచీత్తులపై ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు.. బడ్జెట్‌ వెలుపల తీసుకుంటున్న రుణాలు 2022లో జీడీపీలో 4.5 శాతానికి చేరాయి. తెలంగాణలో అలాంటి పూచీకత్తుల సొమ్ము.. జీడీపీలో 11.7 శాతంగా ఉంది. సిక్కింలో 10.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 9.8 శాతంగా, రాజస్థాన్‌లో 7.1 శాతంగా, యూపీలో 6.3 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని