దుర్గమ్మ తెచ్చే కాసుల పంట.. పశ్చిమబెంగాల్‌లో దసరా వ్యాపారం ఎంతో తెలుసా?

 భక్తిశ్రద్ధలు, సంతోష, సంబరాలతో సాగే దసరా వేడుకలు పశ్చిమబెంగాల్‌లో రూ.40 వేల కోట్ల వ్యాపారానికి వేదికయ్యాయి. అంతేకాదు ఏకంగా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

Updated : 04 Oct 2022 07:11 IST

కోల్‌కతా:  భక్తిశ్రద్ధలు, సంతోష, సంబరాలతో సాగే దసరా వేడుకలు పశ్చిమబెంగాల్‌లో రూ.40 వేల కోట్ల వ్యాపారానికి వేదికయ్యాయి. అంతేకాదు ఏకంగా సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఫోరమ్‌ ఫర్‌ దుర్గాస్తాబ్‌(ఎఫ్‌ఎఫ్‌డీ) ఛైర్మన్‌ పార్థో ఘోష్‌ సోమవారం వెల్లడించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 వేల దుర్గా మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క కోల్‌కతాలోనే ఇవి మూడు వేలున్నాయి. వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి’ అని ఆయన వివరించారు. ‘‘ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారు. ముఖ్యంగా మండపాలు నిర్మాణదారులు, విగ్రహాల రూపకర్తలు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్‌ సేవలందించేవారు ఉంటారు’’అని ఘోష్‌ తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని