అరచేతిని నరుక్కున్న సాధువు

దేశంలో అమలవుతున్న వివిధ పథకాల్లో అవినీతిని నిర్మూలించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ సాధువు తన కుడి అరచేతిని నరుక్కున్నాడు. రామ్‌నగరిలో సరయూ నదిలో స్నానం ఆచరించిన అతను పదునైన ఆయుధంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

Updated : 04 Oct 2022 05:54 IST

దేశంలో అమలవుతున్న వివిధ పథకాల్లో అవినీతిని నిర్మూలించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ సాధువు తన కుడి అరచేతిని నరుక్కున్నాడు. రామ్‌నగరిలో సరయూ నదిలో స్నానం ఆచరించిన అతను పదునైన ఆయుధంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మిగిలిన చేతి నుంచి అరచేయి విడిపోవడంతో భారీగా రక్తం పోయింది. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానికులు సమీపంలోని శ్రీరామ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం డివిజనల్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని బిహార్‌లోని అరారియా జిల్లా సమాజ్‌సేవీ గ్రామపంచాయతీకి చెందిన విమాల్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతని జేబులో నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో కేంద్రం అమలుచేస్తున్న పలు పథకాల ప్రస్తావన ఉంది. దేశంలో వేళ్లూనుకున్న అవినీతి కారణంగా వాటివల్ల తనకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని సాధువు ఆరోపించాడు. విమల్‌కుమార్‌ మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని