Prashant kishor: పాదయాత్ర తొలిరోజే ప్రశాంత్‌ కిశోర్‌కు షాక్‌

సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందానికి తొలిరోజే షాక్‌ తగిలింది.

Updated : 04 Oct 2022 13:25 IST

జనం రాక మైదానం మొత్తం ఖాళీ

సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందానికి తొలిరోజే షాక్‌ తగిలింది. యాత్ర మొదటిరోజైన ఆదివారం బిహార్‌లోని పశ్చిమ చంపారణ్‌ జిల్లా బేతియాలో నిర్వహించిన సభ జనం లేక వెలవెలబోయింది. సభాప్రాంగణం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. పాదయాత్రలోనూ ఆయన వెంట ప్రజలు పెద్దగా కనిపించలేదు. కొద్దిమంది మినహా స్థానికులెవ్వరూ ఆయన సభకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించడంలో అద్భుత విజయాలు సాధించిన ప్రశాంత్‌ కిశోర్‌.. క్షేత్రస్థాయిలో జనాలను ఆకర్షించడంలో విఫలమవుతున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని