సభ సజావుగా సాగేందుకు సలహాలు ఇవ్వండి

రాజ్యసభ సజావుగా సాగేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం రాజ్యసభలోని వివిధ పార్టీల నేతలను (ఫ్లోర్‌ లీడర్లను) కోరారు.

Updated : 04 Oct 2022 05:48 IST

వివిధ పార్టీల నాయకులను కోరిన రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌

దిల్లీ: రాజ్యసభ సజావుగా సాగేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం రాజ్యసభలోని వివిధ పార్టీల నేతలను (ఫ్లోర్‌ లీడర్లను) కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన తన నివాసంలో విందు ఏర్పాటుచేశారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌, విజయసాయిరెడ్డి (వైకాపా), కనకమేడల రవీంద్రకుమార్‌ (తెదేపా), శక్తిసింగ్‌ గోహిల్‌ (కాంగ్రెస్‌), రామ్‌గోపాల్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ), ఎం.తంబిదురై (ఏఐఏడీఎంకే), సంజయ్‌సింగ్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ) తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాజ్యసభను సాఫీగా నడిపేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా విందు సమయంలో ధన్‌ఖడ్‌ కోరారు. సభ నిర్వహణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చర్చల ద్వారా ప్రతిష్టంభనను తొలగించొచ్చని ఉప రాష్ట్రపతి భావిస్తున్నారని ఈ సందర్భంగా వివిధ పార్టీల ఎంపీలు పేర్కొన్నారు. ఫ్లోర్‌ లీడర్లు, ప్రభుత్వం మధ్య నిరంతరం చర్చలు జరగాలని కూడా ఆయన భావిస్తున్నారని వెల్లడించారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్యసభలోని వివిధ పార్టీల నాయకులతో ఆయన లాంఛనంగా భేటీ అవడం ఇదే తొలిసారి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని