ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమంలో దుర్గాష్టమి

దుర్గాష్టమి ఉత్సవాలకు దేశ, విదేశాలకు చెందిన భక్తులు బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమానికి పోటెత్తారు.

Published : 05 Oct 2022 05:53 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: దుర్గాష్టమి ఉత్సవాలకు దేశ, విదేశాలకు చెందిన భక్తులు బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆశ్రమానికి పోటెత్తారు. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ రవిశంకర్‌ గురూజీ తన ఆశ్రమంలో మంగళవారం నిర్వహించిన సుదర్శన హోమం, చండీ హోమం, దుర్గా పూజల్లో లక్షన్నర మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 82 దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేదఘోష మధ్య ధ్యానం, భక్తి గీతాలాపన, సాత్విక విందుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మనలో నిద్రాణమై ఉన్న శక్తిని జాగృతపరచడమే నవరాత్రి సంబరాలు అని రవిశంకర్‌ గురూజీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని